IPL 2022 : Deepak Charar దూరం .. బెడిసికొడ్తున్న CSK వ్యూహం | RCB Vs CSK | Oneindia Telugu

2022-04-12 1

ipl 2022 : deepak chahar ruled out from the current season
#ipl2022
#csk
#chennaisuperkings
#deepakchahar
#rcb
#cskvsrcb

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా నాలుగు పరాజయాలతో చతికిలపడ్డ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే)కు గట్టి షాక్ తగిలింది. లీగ్‌లోని సగం మ్యాచ్‌ల తర్వాత అందుబాటులోకి వస్తాడని భావించిన స్టార్ పేసర్ దీపక్ చాహర్.. లీగ్ మొత్తానికి దూరమైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. తొడ కండరాల గాయం నుంచి కోలుకుని బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్న దీపక్ చాహర్‌కు మరో గాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను వెన్నుగాయంతో బాధపడుతున్నట్లు ఎన్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి.